Asianet News TeluguAsianet News Telugu

రాచరికానికి వ్యతిరేకంగా క‌ల‌మెత్తిన బారిష్ట‌ర్ జి పి పిళ్లై

నూనుగు  మీసాల వయస్సులోనే రాచ‌రిక విధానాల‌కు వ్య‌తిరేకంగా క‌ల‌మెత్తి.. బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన క‌లంవీరుడు. 

First Published Aug 5, 2022, 4:45 PM IST | Last Updated Aug 7, 2022, 8:51 AM IST

నూనుగు  మీసాల వయస్సులోనే రాచ‌రిక విధానాల‌కు వ్య‌తిరేకంగా క‌ల‌మెత్తి.. బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన క‌లంవీరుడు. తిరువితంకూర్ ఆధునిక ప్రజాస్వామ్య ఉద్యమానికి పితామహుడు. 19వ శతాబ్దపు ప్రముఖ భారతీయ సంపాదకులు. భారతీయ ఆంగ్ల రచనకు మార్గదర్శకుడు. గాంధీ సలహాదారు.. ఆయ‌నే.. గోవిందన్ పరమేశ్వరన్ పిళ్లై. బారిస్టర్ జి పి పిళ్లై సుపరిచితుడు.

ఆయ‌న‌ 1864లో తిరువనంతపురంలోని కజకూట్ సమీపంలోని పల్లిపురంలో జన్మించాడు. ఆయ‌న తల్లి దండ్రులు కార్త్యాయనీ, హరిహర అయ్యర్. ఆయ‌న తిరువనంతపురం మహారాజా కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే అనేక‌ వార్తాపత్రికలలో వ్యాసాలు రాశారు. ఆయ‌న రచనలు ప్ర‌ధానంగా ట్రావెన్‌కోర్ రాచరిక వ్య‌వ‌స్థ‌కు, దివాన్ ల ఆగ‌డాల‌ను ప్ర‌శ్నిస్తూ సాగేవి.

రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లోని అవినీతి, బంధుప్రీతి, అణ‌గారిన వ‌ర్గాల‌పై వివక్ష.. అనే ఆయ‌న రచనల అంశంగా ఉండేవి. దీంతో ఆయ‌న రాజాగ్రహానికి గుర‌య్యారు. దీవాన్ వెంబక్కం రామయ్యంకర్.. ఆయనను మహారాజా కళాశాల నుంచి బహిష్కరించారు. రాచరికానికి వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు ట్రావెన్‌కోర్‌ను బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వ్య‌క్తిగా పిళ్లై చరిత్ర‌కెక్కారు. ఈ ప‌రిణామనంత‌రం..  పిళ్లై  విద్యాభ్యాసం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో సాగింది.

విద్యాభ్యాసం అనంత‌రం.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారిగా స్థాపించిన‌ ఆంగ్ల పత్రిక అయిన మద్రాస్ స్టాండర్డ్‌కు సంపాద‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ వార్తాపత్రిక బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమానికి మౌత్ పీస్ గా ఉండేది. బ్రాహ్మ‌ణ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎండ‌గ‌డుతూ.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యవంతుల‌ను చేసేంది. ఇలా ఆయ‌న త‌న ర‌చ‌న‌లు, సంపాద‌కీయాల‌తో ట్రావెన్‌కోర్‌లో ఆధునిక ప్రజాస్వామ్య ఉద్యమానికి ఊపిరి ఊదాడు. 1891లో మలయాళీ మెమోరియల్‌ని నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించారు GP పిళ్లై.

మలయాళీ మెమోరియల్ అనేది.. ట్రావెన్‌కోర్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక శాతం బ్రాహ్మణులే ఉండేవారు. పై స్థాయి ఉద్యోగాల్లో వారిచే భ‌ర్తీ చేసేవారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ 10,000 మందితో సంతకాలు చేయించి.. ఓ పిటిషన్ దాఖలు చేశారు.

మ‌రోవైపు..  స్వామి వివేకానంద, డా.పల్పుల సూచనల మేరకు బ్రిటిష్ పార్లమెంట్‌లో ఈజ్వా సమాజానికి సంబంధించిన ఫిర్యాదులను లేవనెత్తేందుకు లండన్‌కు వెళ్లారు.

ఆయన స్వాతంత్య్రోద్యమంలోనూ కీల‌క భూమిక‌ను పోషించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సమావేశానికి హాజరైన ఏకైక మలయాళీ జి.పి.పిళ్లై.  ఆయ‌న‌ 1894 ,1898లో భార‌త‌ జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఆయ‌న 1898లో లండన్‌లోని మిడిల్ టెంపుల్ నుండి బారిష్ట‌ర్ పట్టా పొందారు. ఈ స‌మ‌యంలో తన రాజకీయ కార్యకలాపాలలో పిళ్లై తనకు సహాయాన్ని అందించారని గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నారు. పిళ్లై రాసిన భారతీయ ప్రతినిధులు, ఇండియన్ కాంగ్రెస్‌మెన్, లండన్ మరియు ప్యారిస్,  ట్రావెన్‌కోర్ వంటి రచనలు ప్రసిద్ధి చెందాయి. అతను ట్రావెన్‌కోర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 39 సంవత్సరాల వయస్సులో మరణించాడు.