Asianet News TeluguAsianet News Telugu

అగ్నిపథ్ పై ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా

వాయుసేనలో అగ్నివీర్ దరఖాస్తులు పెల్లుబికుతున్న వేళ ... ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా, ఎయిర్ ఆఫీసర్ ఇంఛార్జ్ (Personnel), భారతీయ వాయుసేన ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

వాయుసేనలో అగ్నివీర్ దరఖాస్తులు పెల్లుబికుతున్న వేళ ... ఎయిర్ మార్షల్ సూరజ్ కుమార్ ఝా, ఎయిర్ ఆఫీసర్ ఇంఛార్జ్ (Personnel), భారతీయ వాయుసేన ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అగ్నిపథ్ కింద రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 1,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంకో వారం గడువు కూడా ఉండడంతో ఈ సంఖ్యా మరింత పెరగొచ్చు అని ఆయన తెలిపారు. వాయుసేనలో అగ్నిపథ్ ద్వారా రిక్రూట్ చేసుకునే అగ్నివీరుల సంఖ్య  రానున్న ఏడాదుల్లో మరింత పెరుగుతుందని ఎయిర్ మార్షల్ తెలిపారు. అగ్నిపథ్ వల్ల యువ రక్తం వాయుసేనలోకి ప్రవేశించడం వాల్ వాయుసేన సమగ్రంగా ఎంత పటిష్టమవుతుందో నుంచి వాయుసేన లో అగ్నివీరులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారో కూడా చాల స్పష్టంగా వివరించారు. అగ్నివీరులలో 25 శాతం మందిని ఎలా రిటైన్ చేసుకుంటారు, అందుకు ఎలాంటి పద్దతిని ఫాలో అవుతారో కూడా ఒక అవగాహనా కల్పించారు. అగ్నివీర్ వాయు కి సంబంధించిన పూర్తి విషయాలు మనోజ్ కుమార్ ఝా నుంచి తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూ చూసేయండి..!