ఏషియా నెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : కేరళ కళామండలాన్ని సందర్శించిన క్యాడెట్లు..!

ఏషియానెట్ న్యూస్, ఎన్‌సీసీ సంయుక్తంగా చేపడుతున్న వజ్ర జయంతి యాత్ర మంగళవారం కేరళలోని కళామండలానికి చేరుకుంది.

First Published Jun 21, 2022, 10:03 PM IST | Last Updated Jun 21, 2022, 10:03 PM IST

ఏషియానెట్ న్యూస్, ఎన్‌సీసీ సంయుక్తంగా చేపడుతున్న వజ్ర జయంతి యాత్ర మంగళవారం కేరళలోని కళామండలానికి చేరుకుంది. కేరళ కళామండలంలోని కళా రూపాలను వజ్ర జయంతిలో పాల్గొన్న క్యాడెట్లు చూసి మురిసిపోయారు. అలాగే, వల్లథాల్ మెమోరియల్, నీలా క్యాంపస్‌లోని పలు థియేటర్లను వారు సందర్శించారు. వజ్ర జయంతి యాత్రను కళామండలం రిజిస్ట్రార్ సాదరంగా ఆహ్వానించారు. కళా మండలం స్థాపకుడు, విశిష్ట సాహిత్యకారుడు వల్లథాల్ నారాయన మీనన్ గురించి కళామండలంలోని శిల్పాల గురించి క్యాడెట్లు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేరళ ఎన్‌సీసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అలోక్ బెర్రి హాజరయ్యారు.కథాకళి మ్యాస్ట్రో ఎంపీఎస్ నంపూతిరి క్యాడెట్లకు కళామండలం, దాని స్థాపకుడు వల్లథాల్ గురించి వివరంగా విషయాలు తెలియజేశారు.