ఏషియా నెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయతి యాత్ర : ఇస్రో సందర్శన
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర అనేక విశిష్టతలతో ముందుకు సాగుతున్నది.
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర అనేక విశిష్టతలతో ముందుకు సాగుతున్నది. తాజాగా తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ని సందర్శించారు. శాస్త్రవేత్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్న మ్యూజియాన్ని సందర్శించి అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు..! శాస్త్రవేత్తలతో నేరుగా ఇంటరాక్ట్ అవడం వల్ల శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ ఎలా దూసుకుపోతుందో, నూతన ఆవిష్కారాల పట్ల వారికి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దొరికినట్లయింది. మ్యూజియం లోని విషయాలను, ప్రోటో టైప్స్ ని క్యాడెట్స్ ఆసక్తిగా గమనించారు. రాకెట్లకు సంబంధించిన ఇంజన్ల నుంచి అందులో వాడే ఇంధనం వరకు అనేక విషయాలను శాస్త్రవేత్తలు వారికి వివరించారు.