Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ - ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : అమరవీరులకు నివాళులు

ఏషియానెట్ న్యూస్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపడుతున్న వజ్ర జయంతి యాత్ర రెండో రోజు పంగోడ్ మిలిటరీ స్టేషన్‌కు చేరింది. భారత స్వాతంత్ర్య సమరాన్ని వేడుక చేసుకోవడానికి బుధవారం ఈ మిలిటరీ స్టేషన్ చేరుకుంది.

 

First Published Jun 16, 2022, 8:56 AM IST | Last Updated Jun 16, 2022, 9:05 AM IST

ఏషియానెట్ న్యూస్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపడుతున్న వజ్ర జయంతి యాత్ర రెండో రోజు పంగోడ్ మిలిటరీ స్టేషన్‌కు చేరింది. భారత స్వాతంత్ర్య సమరాన్ని వేడుక చేసుకోవడానికి బుధవారం ఈ మిలిటరీ స్టేషన్ చేరుకుంది.దేశాన్ని కాపాడటానికి ప్రాణ త్యాగం చేసిన వారందరికీ ఈ మెమోరియల్ నివాళి అర్పిస్తుంది. ఈ యాత్రలో 150 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాలు పంచుకుని ఏక్ భారత్, శ్రేష్ట భారత్ సందేశాన్ని వ్యాపితం చేయనున్నారు. ఈ యాత్ర ఆసాంతం ఎన్‌సీసీ ఆఫీసర్లు, ఏషియానెట్ న్యూస్ సిబ్బంది క్యాడెట్లతోపాటుగా కొనసాగనున్నారు.ఈ యాత్ర ప్రముఖమైన చారిత్రక ప్రాంతాలు, రక్షణ సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వంటి వాటిని కలుపుతూ సాగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్నవారు దేశం కలిగిన ఉన్నవాటిని తెలుసుకుని గర్విస్తారు.లడాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని రెండేళ్లు గడుస్తున్న రోజే ఈ యాత్ర మెమోరియల్‌కు వెళ్లడం గమనార్హం. గాల్వన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా.. చైనా వైపు మరణించిన జవాన్ల సంఖ్య వెల్లడి కాలేదు.ఈ సందర్భంగా స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ లలిత్ శర్మ మాట్లాడుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లే దేశ భవిష్యత్ అని అన్నారు. వారు ఈ దేశ నిర్మాణ ప్రక్రియలో చిన్న వయసులోనే పాల్గొనడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. వారు కేవలం దేశాన్ని బలోపేతం చేయడమే కాదు.. ఒక భాధ్యతాయుతమైన పౌరులుగా దేశానికి సేవలు అందిస్తారని చెప్పారు. వారందరి పట్ల తాము గర్విస్తున్నామని వివరించారు.ఏషియానెట్ న్యూస్ చేపడుతున్న ఈ కార్యక్రమంపై అధికారి మాట్లాడుతూ, మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దేశవ్యాప్తంగా 75 మంది క్యాడెట్లను ఎంపిక చేసే నిర్ణయాన్ని ఏషియానెట్ న్యూస్ తీసుకోవడం ప్రశంసనీయం అని వివరించారు. వారికి తాము కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్‌సీసీ క్యాడెట్లతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడకలు చేసుకోవడం, దేశానికి ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళలు అర్పిస్తున్నామని, ఇది భారత ఆర్మీకి కూడా గర్వించదగ్గ క్షణం అని వివరించారు.