video: మేక్ ఎ విష్... రాచకొండ కమీషనర్‌గా 17 ఏళ్ల బాలిక

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ పూర్తిచేసింది. వారి చొరవ, రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ సహకారంతో బాలిక  ఇవాళ ఒక్కరోజు(మంగళవారం) పోలీస్ కమీషనర్ గా మారిపోయింది. మహేష్ భగవత్ స్వయంగా ఆమెను తన సీట్లో కూర్చొబెట్టి కమీషనర్ గా ఎలాంటి విధులు నిర్వహించాల్సి వుంటుందో వివరించాడు. 
 
Share this Video

ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి చెందిన రమ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగం సంపాందించాలని కలలు కంటుండేది. అయితే ఈ కోరిక తీరకుండానే ఆమె బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. 

దీంతో ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న మేక్ ఎ విష్ పౌండేషన్ రాచకొండ కమీషనర్ సాయాన్ని పొందారు. దీంతో రమ్య పోలీస్ డ్రెస్ లో కమీషనర్ విధులు నిర్వహించారు.ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రెండ్లీ పోలీసింగ్ తన కమీషనరేట్ పరిధిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా కమీషనర్ చిన్నారికి వివరించారు. 

Related Video