ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని ఉన్న ఓటర్లకు కోటా శ్రీనివాస రావు తన ఓటుతో బుద్ది చెప్పారు. 81 ఏళ్ళ వయస్సులో.. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న కోటా.. పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ.. ఓటు హక్కును వినియోగించు కున్నారు. దాంతో ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు.
ఎనిమిది పదుల వయస్సులో కూడా తన బాధ్యతను మర్చిపోలేదు.. నటుడు కోటా శ్రీనివాసరావు. కదల్లేని పరిస్థితుల్లో ఉండి కూడా కోటీ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తన ఓటును వినియోగించుకుని.. అందరికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.