Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : కొంపల్లిలో మొక్కలు నాటిన జీవన్ రెడ్డి

హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి స్వీకరించారు. 

హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి స్వీకరించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొంపల్లి లోని తన నివాసంలో జీవన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ ను చేపట్టారని దీనివలన పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్, క్రిష్, హీరో నితిన్, సందీప్ కృష్ణ, తిరువీరులను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.