Asianet News TeluguAsianet News Telugu

లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...

ఒక తమిళ దర్శకుడు సినిమా గురించి ఈ మధ్యకాలంలో తెలుగువారు ఇంతలా ఎదురుచూడటం ఇదే మొదటిసారేమో. 

First Published Oct 19, 2023, 3:41 PM IST | Last Updated Oct 19, 2023, 3:41 PM IST

ఒక తమిళ దర్శకుడు సినిమా గురించి ఈ మధ్యకాలంలో తెలుగువారు ఇంతలా ఎదురుచూడటం ఇదే మొదటిసారేమో. నిజానికి విజయ్ సినిమా అనేదాని కన్నా లోకేష్ కనకరాజ్ సినిమా  అని చూడటానికి చాలా మంది ఉత్సాహం చూపించారనటంలో సందేహం లేదు.  విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకముందు విజయ్ తో మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించడం, ఆ రెండు చిత్రాలు  వరల్డ్ వైడ్ గా  ఆడియన్స్ ని కూడా విపరీతంగా అలరించడంతో లియో పై అంతటా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అయితే అదే సమయంలో ఈ చిత్రం ట్రైలర్ అంతగా క్లిక్ కాకపోవటం,  ‘A History of Violence’కు రీమేక్ అని ప్రచారం జరగటం మైనస్ గా మారింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది.. విక్రమ్ స్దాయి హిట్ కొట్టే చిత్రమేనా,అసలు కథేంటి, ఈ చిత్రం LCU లో భాగమేనా కాదా అనే విషయాలు సినిమా చూసిన ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం.