మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....

సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌తో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు సుధీర్‌బాబు.

Share this Video

సూపర్ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌తో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు సుధీర్‌బాబు. ప్రారంభంలో రెండు మూడు చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత `ప్రేమ కథా చిత్రమ్‌`తో హిట్‌ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయనకు పెద్దగా చెప్పుకోదగ్గ హిట్‌ ఒక్కటి కూడా పడలేదు. కొన్ని యావరేజ్‌, మరికొన్ని డిజాస్టర్‌ చిత్రాలే. ఇటీవల కూడా ఆ ఫెయిల్యూర్‌ కొనసాగుతుంది. చివరగా `హంట్‌` చిత్రంతో ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు `మామా మశ్చీంద్ర` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు...త్రిపాత్రాభినయంతో ఒక విభిన్న కథ చిత్రం అంటూ ప్రచారం చేస్తూ ఎంతో కొంత హైప్ తీసుకురావడానికి ట్రై చేసిన పెద్దగా బజ్ అయితే రాలేదు. గత వారం వరకు ఈ సినిమా అసలు రిలీజ్‌ పోటీలోనే లేదు. సడెన్‌గా డేట్‌ దొరికిందని రిలీజ్‌ డేట్‌ ని ప్రకటించారు. నటుడు హర్షవర్థన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఎలా ఉందొ చూసిన ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


Related Video