Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం విడుదలై 20 ఏండ్లు, నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డులివే...

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సంచలనం `ఖుషి`. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా 2001లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

First Published Apr 27, 2021, 12:25 PM IST | Last Updated Apr 27, 2021, 12:24 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సంచలనం `ఖుషి`. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా 2001లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ స్టయిల్‌కి, తన మ్యానరిజాన్ని యూత్‌లో బలమైన ముద్ర వేసిన చిత్రం. డ్రెస్సింగ్‌ స్టయిల్‌కి కూడా ఇదొక కేరాఫ్‌గా నిలిచింది. ఎంతో మంది అభిమానులు ఈ సినిమాని చూసి పవన్‌ మ్యానరిజాన్ని ఫాలో అయ్యేవారు. ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు. `తొలి ప్రేమ` తర్వాత ఆ రేంజ్‌లో పవన్‌కి విజయాన్ని అందించిన చిత్రమిది. ఓ రకంగా ఇది ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రమని చెప్పొచ్చు. దీనికి తమిళ దర్శకుడు, నటుడు ఎస్‌.జె సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.