Asianet News TeluguAsianet News Telugu

పాన్ ఇండియన్ స్టార్ గా విజయ్ ఫెయిల్..?

పాన్ ఇండియా మూవీ...బాహుబలి తర్వాత ఈ మాట సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపించే మాట.

First Published Jan 17, 2021, 10:58 AM IST | Last Updated Jan 17, 2021, 10:58 AM IST

పాన్ ఇండియా మూవీ...బాహుబలి తర్వాత ఈ మాట సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపించే మాట..ఇప్పుడు అందరి కళ్ళు వారి సొంత మార్కెట్ మాత్రమే కాక మిగతా బాషా ఇండస్ట్రీస్ పైన కూడా ఉన్నాయి..అలాగే కొంత మంది హీరోల  మార్కెట్ పరిధి... వారి రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది..ఇలయ దళపతి విజయ్,సూర్య, విక్రమ్, తెలుగు లో అల్లు అర్జున్  లాంటి హీరోల సినిమాలు...  ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యి.. మినిమం కలెక్షన్స్ వసూల్ చేస్తున్నాయి..కొన్ని సార్లు  తెలుగులో అయితే మన స్ట్రెయిట్ సినిమాలు ప్లాప్ అయి... డబ్బింగ్ మూవీస్ హిట్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఈ డబ్బింగ్ చిత్రాలకి వ్యతరేకం గా ఉద్యమాలు నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి..కర్ణాటక లో అయితే బాహుబలి సినిమా ముందు వరకు డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉండేది..ఇప్పుడు ఆ పరిస్థితి మారి పాన్ ఇండియా మూవీ లు గా సినిమాలు తియ్యాలి అని అన్ని బాషా దర్శకులు ప్రయత్నిస్తున్నారు..ఎందుకు??.ఒక్కటే సమాధానం..భారీ వసూళ్లు..అందరికి ఈ దారి చూపిన చిత్రం బాహుబలి..