Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం: ఆర్టీసీ కండక్టర్ మృతదేహం కోసం తోపులాట (వీడియో)

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మరో నిండు ప్రాణం పోయింది. గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో పాల్గొంటున్న ఓ మహిళా కండక్టర్ ఉద్యోగ భరోసాను కోల్పోవడంతో మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మరో నిండు ప్రాణం పోయింది. గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో పాల్గొంటున్న ఓ మహిళా కండక్టర్ ఉద్యోగ భరోసాను కోల్పోవడంతో మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడింది.

 ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నీరజ అనే మహిళ తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. 

మహిళా ఆర్టిసి ఉద్యోగి ఆత్మహత్యతో ఖమ్మం జిల్లాలో విషాదం అలుముకుంది. తమ సహచర ఉద్యోగి ఇలా ప్రాణత్యాగానికి  పాల్పడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యప్తంగా  ఆర్టీసీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  

ఆమె మృతదేహాన్ని సందర్శించిన ఆర్టీసీ కార్మికుల ఖమ్మం రీజినల్ జేఏసీ గడ్డం లింగమూర్తి కుటుంబ సభ్యులను ఓదార్చేప్రయత్నం చేశారు.  అయితే నీరజ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులు, నిరసన తెలిపేందుకు ఆర్టీసీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. 

Video Top Stories