
తల్లికి వందనం రూ.15వేలు ఎప్పుడిస్తారు?: YS జగన్
చదువుకునే పిల్లలకు రూ.15వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఎగనామం పెట్టారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఎంత పిల్లలుంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారని గుర్తుచేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.