నవ నందిగామా నిర్మాణానికి టిడిపి అడ్డంకులు...: వైసిపి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు
నందిగామ : వైసిపి ప్రభుత్వం నందిగామ పట్టణ అభివృద్దికి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష టిడిపి అడుగడుగునా అడ్డుపడుతోందని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు.
నందిగామ : వైసిపి ప్రభుత్వం నందిగామ పట్టణ అభివృద్దికి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష టిడిపి అడుగడుగునా అడ్డుపడుతోందని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. నవ నందిగామ నిర్మాణం పేరిట పట్టణంలోని గాంధీసెంటర్ ప్రాంగణంలో మేధావులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైసిపి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఇతర రాజకీయ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ... నందిగామలో గాంధీ సెంటర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులకు టిడిపి అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. గాంధీ సెంటర్ అభివృద్దితో పాటు విగ్రహాలను ఓ వరుస క్రమంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించామని... ఈ పనులు జరక్కుండా ప్రతిపక్ష నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. కాబట్టి ప్రజలే టిడిపికి బుద్దిచెప్పేలా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు సూచించారు.