West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు
ప.గో: ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందిన దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ప.గో: ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందిన దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలను ప్రత్యక్ష సాక్షితో పాటు డిఎస్పీ దిలీప్, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి వివరించారు.