Asianet News TeluguAsianet News Telugu

పోలవరం ప్రాజెక్ట్ లో కీలక ఘట్టానికి నాంది... గోదావరి డెల్టాకు నీటి విడుదల

అమరావతి: పోలవరం ప్రాజెక్టు లో కీలక ఘట్టాన్ని అధికారులు పూర్తి చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అప్రోచ్ ఛానల్ లోనికి గోదావరి నీటిని విడుదల చేశారు. 

అమరావతి: పోలవరం ప్రాజెక్టు లో కీలక ఘట్టాన్ని అధికారులు పూర్తి చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అప్రోచ్ ఛానల్ లోనికి గోదావరి నీటిని విడుదల చేశారు. ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరో మంత్రి ఆళ్ల నాని, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు పాల్గొన్నారు. 

అప్రోచ్ కెనాల్ కు విడుదల చేసిన నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు సరఫరా అవుతాయి. భారీ వర్షాల సీజన్ లో వరద నీటిని మళ్లించడానికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేశారు.

Video Top Stories