గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...

గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు ఓ వాలంటీర్ బలయిపోయాడు.

First Published Feb 2, 2022, 5:29 PM IST | Last Updated Feb 2, 2022, 5:29 PM IST

గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు ఓ వాలంటీర్ బలయిపోయాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఎడ్ల ఏసుబాబును రాత్రికి రాత్రే విధుల నుండి తొలగిస్తున్నట్లు ఎంపిడివో ప్రకటించారు. గనికపూడి గ్రామంలో విద్యాకమిటి ఎన్నికల్లో కలగచేసుకోవడం వల్లే ఆయనను వాలంటీర్ గా తొలగిస్తున్నట్లు ఎంపిడివో తెలిపారు.అయితే గ్రామంలో వైసిపి రెండు వర్గాలుగా చీలిపోయి వుందని బాధిత వాలంటీర్ తెలిపారు. సర్పంచ్ వర్గానికి చెందిన వ్యక్తిగా భావించి జిలానీ వర్గం తనను విధులనుండి తొలగించేందుకు ప్రయత్నించారని... ఇటీవల ఆ విషయంలో సక్సెస్ అయ్యారని పేర్కొన్నాడు. తనను ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలంటూ వాలంటరీ ఏసుబాబు ఎంపీడీవోకి లిఖితపూర్వకంగా మెమోరాండం సమర్పించారు.  గ్రామ సర్పంచ్ కూడా తనకు తెలియచేయకుండా వాలంటీర్ ను ఎలా తీసివేస్తారంటే ఎంపీడీవో ని ప్రశ్నించారు. 

Video Top Stories