అనన్య అమ్మోనియాలో గ్యాస్ లీక్, భయంతో పరుగులు తీసిన ప్రజలు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో మరో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. 

Share this Video

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో మరో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. జిల్లాలోని పరవడా మండలం భరణికం గ్రామ పరిధిలో గల అనన్య గ్యాస్ కంపెనీలో గ్యాస్ లీకైంది. గ్యాస్ ట్యాంకర్లను నింపుతున్న సమయంలో పైప్ లైన్ లో లీకైంది. దాంతో గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు.గ్యాస్ లీక్ కారణంగా కళ్లు మండుతున్నాయని, ఒళ్లు మంటలు వస్తున్నాయని గ్రామ ప్రజలు చెబుతున్నారు. కంపెనీని మూసేయాలని ప్రజలు ధర్నాకు దిగారు కంపెనీ యాజమాన్యం లేకపోవంతో పోలీసులతో మాట్లాడి ప్రజలు వెనక్కి వెళ్లిపోయారు. రాత్రి సమయం కావడంతో ఏం జరుగుతోందో అనే భయంతో ప్రజలు బయటకు వచ్చారు. ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం మాదిరిగానే ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Video