డిజిటల్ అసిస్టెంట్ పై బూతులు, పిడిగుద్దులతో వాలంటీర్ దాడి..
అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయంలో ఓ గ్రామ వాలంటీర్ డిజిటల్ అసిస్టెంట్ పై దాడి చేశాడు.
అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయంలో ఓ గ్రామ వాలంటీర్ డిజిటల్ అసిస్టెంట్ పై దాడి చేశాడు. గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న చిల్కా వినోద్ తన వార్డ్ పరిధిలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను డిజిటల్ అసిస్టెంట్ బాబురావు కి ఇచ్చాడు. పని ఒత్తిడి కారణంగా వాటిని తరవాత పరిశీలిస్తానని వినోద్ కి చెప్పాడు. దీంతో కోపానికి వచ్చిన వినోద్ బాబూరావును తిడుతూ పిడిగుద్దులతో దాడి చేశాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాట వినలేదు. ఈ ఘటన పై సచివాలయం సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.