విజయవాడ కౌన్సిల్ మీటింగ్ లో యుద్దవాతావరణం... టిడిపి కార్పోరేటర్ల సస్పెండ్

విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, సిపిఎం పార్టీల కార్పోరేటర్ల మాటల యుద్దంతో గందరగోళం ఏర్పడింది. 

First Published Jul 15, 2021, 3:19 PM IST | Last Updated Jul 15, 2021, 3:19 PM IST

విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, సిపిఎం పార్టీల కార్పోరేటర్ల మాటల యుద్దంతో గందరగోళం ఏర్పడింది. 198 జీఓ పై చర్చ జరగాలని  టీడీపీ సభ్యులు పట్టుబట్టగా...అధికారపక్షం చర్చను వ్యతిరేకించింది.  పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో టీడీపీ, సీపీఎం  కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేసి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అయితే తమను అకారణంగా సస్పెండ్ చేశారంటూ కౌన్సిల్ హాల్ బయట బైఠాయించారు కార్పొరేటర్లు. దీంతో సదరు కార్పొరేటర్లను కార్యాలయం నుంచి బయటకు లాక్కెళ్లేందుకు పోలీసులు, మార్షల్స్ యత్నించిన వారు అందుకు అడ్డుకున్నారు. దీంతో సమావేశ మందిరంవద్ద ఉద్రిక్తత నెలకొంది.