Asianet News TeluguAsianet News Telugu

చెత్తకుప్పలు, శిథిలాల మధ్య... ఉండవల్లి సెంటర్లో రంగా విగ్రహం పరిస్థితి ఇదీ...

తాడేపల్లి : ప్రముఖ నాయకుడు వంగవీటి మోహనరంగాను యావత్ రాష్ట్ర ప్రజానీకం గొప్ప నాయకుడిగా కొనియాడుతుంటారు. 

First Published Dec 26, 2022, 1:39 PM IST | Last Updated Dec 26, 2022, 1:39 PM IST

తాడేపల్లి : ప్రముఖ నాయకుడు వంగవీటి మోహనరంగాను యావత్ రాష్ట్ర ప్రజానీకం గొప్ప నాయకుడిగా కొనియాడుతుంటారు. నేడు రంగా వర్ధంతిని ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ రంగా కుడిభుజంగా చెప్పుకునే ఉండవల్లి సెంటర్లో మాత్రం ఆయనను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కాపు నాయకుడిగా గొప్పపేరు సాధించిన రంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కాపు వర్గీయులే ఎక్కువగా వ్యాపారాలు నిర్వహించే ఉండవల్లి సెంటర్లో నాలుగు అడుగుల జాగా దొరకనట్లుంది. దీంతో చెత్తకుప్పలు, శిధిలాల మధ్యలో రంగా విగ్రహం నాలుగేళ్ళుగా పడివుంది.