Yanam tragedy : విహారయాత్రకు వెళ్లి...గోదావరిలో గల్లంతు...

యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు.

First Published Nov 19, 2019, 5:10 PM IST | Last Updated Nov 19, 2019, 5:10 PM IST

యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. కార్తీకమాసం కావడంతో యానాంకు విహారయాత్రకు వచ్చిన రాజమండ్రికి చెందిన 10 మంది యువకుల్లో   ముగ్గురు యువకులు నదిలో స్నానానికి వెళ్లారు. వీరిలో ఇద్దరు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని కొప్పల శేషసాయి పవన్, నేకూరీ చంద్రహాసన్‌గా గుర్తించారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.