Tirupati Laddu Controversy: తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

Share this Video

తిరుపతి లడ్డూ కేసులో అరెస్టులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రపంచంలో అందరికీ దేవుడని.. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారని చెప్పారు. లడ్డూ విషయంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు.పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వెంట కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనందసాయి ఉన్నారు.

Related Video