ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి, జ్ఞానం నేర్పబడును.. విశాఖలో టీడీపీ వినూత్న నిరసన (వీడియో)

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , ఆయన సతీమణి నారా భువనేశ్వరీపై (nara bhuvaneshwari) అసెంబ్లీలో (ap assembly) వైసీపీ (ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (tdp) శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

| Updated : Nov 28 2021, 02:55 PM
Share this Video

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , ఆయన సతీమణి నారా భువనేశ్వరీపై (nara bhuvaneshwari) అసెంబ్లీలో (ap assembly) వైసీపీ (ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (tdp) శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ టీడీపీ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. ఎన్టీఆర్ స్కూల్‌లో (ntr school) బుద్ధి జ్ఞానం నేర్పబడును అంటూ కొడాలి నాని (kodali nani), అంబటి (ambati rambabu), వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) ,సీఎం జగన్ (cm jagan), విజయసాయి రెడ్డిల (vijaya sai reddy) మాస్క్ రూపంలో నిరసన నిర్వహించారు. 

దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం , వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడుతున్నారని తెలుగు మహిళ కార్యకర్తలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ వైసీపీ నేతలకు మార్పు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 

 


 

Related Video