తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అరెస్ట్...

అమరావతి : అధికార వైసిపి నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ టిడిపి నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Share this Video

అమరావతి : అధికార వైసిపి నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ టిడిపి నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టిడిపి నాయకులు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయమే పలువురు టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖపట్నం నుండి విజయవడకు చేరుకున్న టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను అరెస్ట్ చేసారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అనితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇక మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా తదితరులను కూడా పోలీసులు ఉదయమే హౌస్ అరెస్ట్ చేసారు. అంతేకాదు ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులను మొహరించారు. దీంతో టిడిపి నాయకులు వ్యూహం మార్చి తాడిగడపలోని ఏపీఎండీసీని ముట్టడించారు. 

Related Video