టిడిపి ఎమ్మెల్యే దౌర్జన్యం... చొక్కాపట్టుకుని అడ్డుకున్న సామాన్య మహిళ
ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ సామాన్య మహిళపై దౌర్జన్యానికి పాల్పడటం వివాదాస్పదంగా మారింది.
ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ సామాన్య మహిళపై దౌర్జన్యానికి పాల్పడటం వివాదాస్పదంగా మారింది. పాలకొల్లు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు పాల్గొన్నారు. ఓవైపు పాదయాత్ర, మరోవైపు వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇదే విషయమై ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో తీవ్ర అసహనానికి గురయిన రామానాయుడు మహిళ చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కుని దౌర్జన్యానికి దిగాడు. సెల్ ఫోన్ కింద పడేయడానికి ప్రయత్నించగా సదరు మహిళ ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని లాగింది. ఇలా ఎమ్మెల్యేకు, మహిళా ప్రయాణికురాలికి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణను అదే బస్సులో వున్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎమ్మెల్యే రామానాయుడు తీరును నెటిజన్లు, వైసిపి శ్రేణులు తప్పుబడుతున్నాయి.