సొంత బాబాయ్ ని చంపించి... జగన్ రాజకీయ వ్యభిచారం : చింతమనేని సంచలనం

గన్నవరం : టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

First Published Apr 21, 2023, 4:29 PM IST | Last Updated Apr 21, 2023, 4:29 PM IST

గన్నవరం : టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్ చంపేసారని ఆరోపించారు. దీన్ని రాజకీయం చేసి నారాసురవారి రక్త చరిత్ర అంటూ తప్పుడురాతలు రాయించి నానా యాగి చేసి గుండెలు బాదుకున్నాడని అన్నారు. ఇలా బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయ వ్యభిచారం చేసారని చింతమనేని సంచలన వ్యాఖ్యలు చేసారు.   నీ చెల్లికే వైసిపి ప్రభుత్వంపై నమ్మకం లేదు... అందుకే తండ్రి హత్య కేసును తెలంగాణ మార్చాలని కోరింది... సిగ్గుందా జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు కూడా వైసిపి ప్రభుత్వ అరాచకాలతో విసిగిపోయారని అన్నారు. ప్రస్తుతం వైసిపి వెంటిలేటర్ పై ఉంది... అది తీసేస్తే ప్రభుత్వం కూలినట్లే అని అన్నారు. టిడిపికి మాత్రం మరణం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపిని ప్రజలే బంగాళాఖాతంలో కలుపుతారని అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ ను లోపల వేయడానికి ఈడి, సిబిఐ సిద్దంగా వున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని.