Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని ఇలాకాలో చింతమనేని ప్రభాకర్ క్రేజ్ చూడండి...

 గుడివాడ : అమరావతి రైతులు రాజధానిని తమ ప్రాంతంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.

First Published Sep 25, 2022, 5:13 PM IST | Last Updated Sep 25, 2022, 5:13 PM IST

 గుడివాడ : అమరావతి రైతులు రాజధానిని తమ ప్రాంతంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అమరావతి నుండి అరసవెల్లికి రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర గుడివాడలో ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని శరత్ టాకీస్ వద్దకు అమరావతి రైతుల పాదయాత్ర చేరుకోగానే ఒక్కసారిగా వైసిపి నాయకులు, కార్యకర్తలు జై కొడాలి నాని అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

గుడివాడలో పరిస్థితుల నేపథ్యంలో రైతు పాదయాత్రలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. కానీ ఆయన తన కారులో కాకుండా పోలీసుల కళ్లుగప్పి బైక్ పై గుడివాడకు చేరుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న చింతమనేనికి అభిమానులు భుజానెత్తుకుని అభిమానం చాటుకున్నారు. ఇలా కొడాలి నాని ఇలాకాలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని సందడి చేసాడు.