నడి వీధిలో చీర విప్పేసి నిలబెడతామని వైసిపి వాళ్ల బెదిరింపులు : లోకేష్ వద్ద మహిళ ఆవేదన
తిరుపతి : టిడిపి జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.
తిరుపతి : టిడిపి జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల శ్రీకాళహస్తి పాదయాత్రలో లోకేష్ కు తమ సమస్యలు చెప్పుకున్నందుకు తోపుడుబండిపై నడుపుకునే టిఫిన్ సెంటర్ ను వైసిపి వాళ్లు ధ్వంసం చేసారని బాధిత మహిళ మునిరాజమ్మ ఆరోపించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పాదయాత్ర సాగిస్తున్న లోకేష్ ను కలిసిన బాధిత దంపతులు దాడి గురించి వివరించారు. దీంతో వారికి టిడిపి అండగా వుంటుందని... ఎవ్వరికీ భయపడవద్దని లోకేష్ సూచించారు.
అంతకుముందు మునిరాజమ్మ మాట్లాడుతూ... తనపై దాడిచేసి వైసిపి వాళ్లే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే తన భర్త వెంకటాద్రిని కూడా ఉద్యోగంలోంచి తొలగించారని తెలిపారు. ఎమ్మెల్యే ముధుసూధన్ రెడ్డికి క్షమాపణలు చెప్పి బూట్లు నాకితే క్షమించి వదిలేస్తారని కొందరు వైసిపి నాయకులు భయపెట్టారని.. వీరి బెదిరింపులకు భయపడలేదని అన్నారు. ఇళ్లు కూల్చేసినా చెట్టుకింద బ్రతుకుతాను కానీ ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పబోనని మునిరాజమ్మ పేర్కొన్నారు.