Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

గుంటూరు: సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న ప్రముఖులు, చట్టాలను కాపాడాల్సిన పోలీసు గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న ప్రముఖులు, చట్టాలను కాపాడాల్సిన పోలీసు గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు పట్టణంలో రేవ్ పార్టీ కల్చర్ వెలుగుచూసింది. లక్ష్మీపురంలో లక్ష్మీపురంలో ఓ బిల్డింగ్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో అర్ధరాత్రి పట్టాబిపురం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలు, 20 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ఓ సీఐతో పాటు మరో ముగ్గురు ప్రముఖులను తప్పించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.