Asianet News TeluguAsianet News Telugu

హోల్ సేల్ గా మచిలీపట్నం లూటీకి పేర్ని నాని ప్రయత్నం : టీడీపీ నేత రవీంద్ర

మాజీ  మంత్రి, స్థానిక వైసిపి ఎమ్మెల్యే  పేర్ని నాని మచిలీపట్నంను హోల్ సేల్ గా లూటీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

First Published Apr 26, 2023, 4:46 PM IST | Last Updated Apr 26, 2023, 4:46 PM IST

మాజీ  మంత్రి, స్థానిక వైసిపి ఎమ్మెల్యే  పేర్ని నాని మచిలీపట్నంను హోల్ సేల్ గా లూటీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రైవేట్ ఆస్తులనే కాదు గుడులు, బడులు సైతం దోచుకునేలా మచిలీపట్నం మాస్టర్ ప్లాన్ ని తయారు చేసారని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలుతో భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుంది... కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని మచిలీపట్నం వాసులకు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.   మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) నూతన మాస్టర్ ప్లాన్ పై మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గతంలో భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముడా ఏర్పాటు చేసామని... కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని నిర్వీర్యం చేసారని ఆరోపించారు