మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ రోడ్డు విస్తరణ ఉద్రిక్తత... ఇప్పటంలో ఆందోళనలు
గుంటూరు : మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటంలో చేపట్టిన రోడ్డువిస్తరణ పనులు ఉద్రిక్తంగా మారాయి.
గుంటూరు : మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటంలో చేపట్టిన రోడ్డువిస్తరణ పనులు ఉద్రిక్తంగా మారాయి. తమ ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగగా వారికి టిడిపి, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. తమకు తగిన పరిహారం చెల్లించి న్యాయం చేసాకే ఇళ్ల తొలగించాలంటూ కూల్చివేత పనులను అడ్డుకునే ప్రయత్నం చేసారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన చేపట్టినవారిని అదుపులోకి తీసుకున్నారు