AP Assembly: దమ్ముంటే రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీస్కో: పవన్ కి రోజా సవాల్ | Asianet News Telugu
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల తీరుపై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబుపై పొగడ్తలు తప్ప ఏమీ లేదన్నారు. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ అనుకుంటే చంద్రబాబుకు కూడా ప్రతిపక్ష హోదా దక్కేది కాదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అవసరమన్నారు. నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకోవాలని సవాల్ చేశారు.