పందుల్లా గుంపుగా కాదు.. దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్..: పవన్ కు రోజా సవాల్

అమరావతి :  రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి కేవలం 45 నుంచి 67 సీట్లకు మాత్రమై పరిమితం కానుందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు.

First Published Sep 19, 2022, 3:53 PM IST | Last Updated Sep 19, 2022, 3:53 PM IST

అమరావతి :  రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి కేవలం 45 నుంచి 67 సీట్లకు మాత్రమై పరిమితం కానుందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ఒంటరిగా పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యారు... పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే కాలేకపోయాడని రోజా ఎద్దేవా చేసారు. చిన్నపిల్లలు మీటింగ్ కు వచ్చి సీఎం..సీఎం అని అరిస్తే ముఖ్యమంత్రి అయిపోతారనుకున్నావా...  అంటూ పవన్ కు రోజా చురకలు అంటించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా వుండాల్సిన హైదరాబాద్ ను మీ మిత్రపక్షాలు టిడిపి, బిజెపి అర్ధాంతరంగా వదిలివచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు... షూటింగ్ లో వున్నావా లేక సూట్ కేసులు తీసుకుంటున్నావా? అంటూ రోజా ప్రశ్నించారు. నిజంగానే నీకు దమ్ముంటే రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ సీట్లలోనూ జనసేన అభ్యర్ధులనే పోటీలో నిలిపి జగన్ తో డీకొనాలని పవన్ కు రోజా సవాల్ విసిరారు. అలాకాదని బిజెపి, టిడిపి తో కలిసొస్తానంటావా...  పందులే గుంపుగా వస్తాయని గుర్తుపెట్టుకోవాలంటూ పవన్ పై మంత్రి రోజా ధ్వజమెత్తారు.