వైసీపీ ప్రశ్నలకు మంత్రి లోకేష్ రిప్లై.. అసెంబ్లీలో ఇచ్చిపడేశాడు | AP Assembly | Asianet News Telugu
డీఎస్సీ నోటిఫికేషన్ పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. 1994 నుంచి 2,60,194 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ చేసినవేనని గుర్తుచేశారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని వివరించారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నామని తెలిపారు.