అగ్గిపెట్టెల లోడ్ లారీలో చెలరేగిన మంటలు... నడిరోడ్డుపై కాలిబూడిదైన వాహనం

విశాఖపట్నం: అగ్గిపెట్టెల లోడ్ తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని రోడ్డుపైనే కాలిబూడిదయ్యింది. 

| Published : Mar 18 2022, 12:27 PM IST
Share this Video

విశాఖపట్నం: అగ్గిపెట్టెల లోడ్ తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని రోడ్డుపైనే కాలిబూడిదయ్యింది. ఈ దుర్ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే మొత్తం వ్యాపించాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే దట్టమైన మంటల ధాటికి లారీ మొత్తం కాలి బూడిదైపోయింది. అగ్రిమాపక సిబ్బంది  అక్కడికి చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. నడిరోడ్డుపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

Related Video