ప.గో జిల్లాలో కలకలం... పోలీస్ స్టేషన్ లోనే ఎస్సైపై లాయర్ దాడి

భీమవరం: పోలీస్టేషన్ కు చేరిన ఓ ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన లాయర్ ఎస్సైపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

First Published Jun 1, 2022, 12:29 PM IST | Last Updated Jun 1, 2022, 12:29 PM IST

భీమవరం: పోలీస్టేషన్ కు చేరిన ఓ ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన లాయర్ ఎస్సైపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో మోసపోయిన యువతి పెనుగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకున్ని పోలీస్ స్టేషన్ పిలిపించి అతడి నుండి కూడా వివరాలు సేకరించాలని ఎస్సై భావించాడు. అయితే యువకుడితో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన లాయర్ పోలీసులపైనే దౌర్జన్యానికి దిగాడు. ఎస్సై కాలర్ పట్టుకుని దాడికి యత్నించి నానా హంగామా సృష్టించాడు. ఇలా పోలీస్ స్టేషన్ లోనే ఎస్సైపై దాడి ప.గో జిల్లాలో కలకలం రేపింది.