రెడ్ బుక్ కి, బ్లడ్ బుక్ కి జగన్ భయపడడు: మాజీ మంత్రి ఆర్కే రోజా | YSRCP Vs TDP | Asianet Telugu
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం చాలా ఈజీ అనుకున్నానని ఇప్పుడు నా వల్ల కావడం లేదని చంద్రబాబే అంగీకరించారని వైసీపీ మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. తనకు చేతకానప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని హితవు పలికారు. జగన్‌ను కూర్చోబెడితే పథకాలను తూచ తప్పకుండా ఎలా అమలు చేయాలో చేసి చూపిస్తారన్నారు. చంద్రబాబుకి హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ది, ప్రజలకు మేలు చేయాలన్న మనసు ఆయనకు లేదని.. అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతాడని విమర్శించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ కి, బ్లడ్ బుక్ కి జగన్ భయపడడన్నారు.