భార్య మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్లిన పేద భర్త, చూస్తే కన్నీళ్లు ఆగవు..!

విజయనగరం : మనుషుల్లో మానవత్వం చచ్చిందని ఓ ఆటో డ్రైవర్ చేష్టలు నిరూపిస్తే... 

First Published Feb 9, 2023, 4:28 PM IST | Last Updated Feb 9, 2023, 4:28 PM IST

విజయనగరం : మనుషుల్లో మానవత్వం చచ్చిందని ఓ ఆటో డ్రైవర్ చేష్టలు నిరూపిస్తే... లేదు లేదు ఇంకా కొందరిలోనైనా అది దాగి వుందని ఆ పోలీస్ నిరూపించాడు. అనారోగ్యం బారినపడ్డ భార్యకు చికిత్స చేయించేందుకు ఒడిశా రాష్ట్రంలోని కోరాపేట్ ప్రాంతానికి చెందిన నిరుపేద గిరిజనుడు విశాఖపట్నం వచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆటోలో భార్యను తీసుకువెళుతుండగా ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది. దీంతో శవాన్ని తన ఆటోలో తీసుకెళ్లలేనంటూ డ్రైవర్ రోడ్డుపైనే దించేసాడు. చేసేదేమి లేక ఆ భర్త కన్నీటిని దిగమింగుతూనే భార్య శవాన్ని భుజానెత్తుకుని వంద కిలోమీటర్లు నడిచాడు. అయితే విజయనగరంలో ఇలా భార్య మృతదేహాన్ని మోస్తూ తీసుకెళుతున్న అతడిని ఓ పోలీస్ అధికారి గుర్తించాడు. అతడి నుండి వివరాలు సేకరించి సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటుచేసి పంపించారు.