కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. ఇళ్లలోకి చేరుకుంటున్న వరద నీరు...
కృష్ణా జిల్లా మైలవరంలో ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుంచి మొదలైన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కృష్ణా జిల్లా మైలవరంలో ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుంచి మొదలైన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవుని చెరువులో వరద నీరు నివాస గృహాలలోకి చేరింది. జి.కొండూరు మండలం కుంటముక్కల అడ్డరోడ్డు వద్ద కొండవాగు పొంగి రహదారిపై జల సముద్రంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ఇంత భారీ వర్షం పడలేదని స్థానికులు అనుకుంటున్నారు.