Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం... పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఇదీ పరిస్థితి...

పోలవరం : తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.

First Published Jul 11, 2022, 11:57 AM IST | Last Updated Jul 11, 2022, 11:57 AM IST

పోలవరం : తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఆకస్మికంగా వరద ఉదృతి పెరిగి పనులను ఆటంకం కలిగిస్తోంది. పోలవరం స్పిల్ వే దగ్గర గోదావరి నీటిమట్టం 29.4మీటర్లకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ నుండి  4 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వదులుతున్నారు. ఇక ఈ వరద ఉదృతి మరింత పెరిగి  12లక్షల క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.