Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ వారసులు చంద్రబాబుని తరిమికొట్టడం ఖాయం..: కొడాలి నాని సంచలనం

గుడివాడ : 2024 ఎన్నికల తర్వాత మీ బాబూ కొడుకులిద్దరినీ (చంద్రబాబు నాయుడు, నారా లోకేష్) ఎన్టీఆర్ వారసులు తన్ని తరిమికొట్టడం ఖాయమని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 

First Published Nov 22, 2022, 12:59 PM IST | Last Updated Nov 22, 2022, 12:59 PM IST

గుడివాడ : 2024 ఎన్నికల తర్వాత మీ బాబూ కొడుకులిద్దరినీ (చంద్రబాబు నాయుడు, నారా లోకేష్) ఎన్టీఆర్ వారసులు తన్ని తరిమికొట్టడం ఖాయమని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ దగ్గరినుండి కొట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన సొంతం అనుకుంటున్నాడని అన్నారు. మనదేందిరా ఇంత దరిద్రపు బ్రతుకు అనుకుంటూ చంద్రబాబు, లోకేష్ ఒకర్నొకరు వాటేసుకుని ఏడ్చేరోజులు దగ్గర్లోనే వున్నాయన్నారు. అప్పుడు ఇదేం కర్మరా బాబు అనుకుంటారని కొడాలి నాని మండిపడ్డారు. 

చంద్రబాబు పిచ్చికుక్కలా నోటికొచ్చినట్లు ఎంత వాగినా ఆయన్ని ప్రజలు పిచ్చోడిలానే చూస్తారన్నారు నాని. ఆయనెన్ని కుట్రలు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే చచ్చిన తెలుగుదేశం పార్టీ ఏపీలో వెంటిలేటర్ పై వుందని... 2024 ఎన్నికల తర్వాత చావడం ఖాయమన్నారు. వైఎస్సార్ పార్టీ గెలుపు కోసం, జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసే వరకు తన చివరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తానని మాజీ మంత్రి నాని అన్నారు.