
Gottipati Ravi Kumar: హత్యా రాజకీయాలు చేస్తే వదిలేది లేదు: మంత్రి గొట్టిపాటి
పల్నాడు జిల్లాలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే, టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఘటనలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అరాచకాలతో గందరగోళం సృష్టించేది వైసీపీ అయితే, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగినా తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని తేల్చిచెప్పారు.