Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ టు బెంగళూరు... బస్సులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ యువకుడు

కాకినాడ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాకినాడ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం సెంటర్ వద్ద నాలుగు బ్యాగులతో ఇద్దరు యువకులు బెంగుళూరు వెళుతున్న బస్సు ఎక్కారు. అయితే బస్సు రాజనగరం దగ్గరకు చేరుకున్న తర్వాత ఏదో వాసన రావడంతో బస్సు డ్రైవరు తనిఖీ చేయగా బ్యాగుల నిండా గంజాయి బయటపడింది. ఈ తనిఖీ సమయంలోనే ఓ యువకుడు పరారవగా మరో యువకుడిని ప్రయాణికుల సాయంతో డ్రైవర్ పట్టుకున్నారు. యువకుడితో పాటు పట్టుబడిన 74బ్యాగుల గంజాయిని కాకినాడ సర్పవరం పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. 

Video Top Stories