Video : డబ్బుల కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన కిరాతకుడు
గుంటూరు జిల్లా తాడేపల్లి అమర్ రెడ్డి కాలనీలో ఓ తండ్రి డబ్బుల కోసం సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి అమర్ రెడ్డి కాలనీలో ఓ తండ్రి డబ్బుల కోసం సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడు. శ్రీనివాసరావు తన స్నేహితులు శామ్యూల్, అతని తమ్ముడు అబ్రహంతో కలిసి తన సొంత కొడుకు ఆరేళ్ల పార్థసారథిని పథకం ప్రకారం కిడ్నాప్ చేశాడు. 5 లక్షల రూపాయలిస్తేనే బాలుని అప్పగిస్తామని డిమాండ్ చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నారు. బాలుడిని ఎత్తుకెళ్లిన అబ్రహం కోసం గుంటూరు పరిసరప్రాంతాల్లో తాడేపల్లి పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.