కొడుకు మృతదేహంతో బైక్ పైనే 90కి.మీ... తిరుపతి రుయాలో అమానవీయ ఘటన

తిరుపతి: హాస్పిటల్ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించడంతో ఓ తండ్రి కన్న కొడుకు మృతదేహంతో బైక్ పైనే 90కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. 

First Published Apr 26, 2022, 2:08 PM IST | Last Updated Apr 26, 2022, 2:08 PM IST

తిరుపతి: హాస్పిటల్ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించడంతో ఓ తండ్రి కన్న కొడుకు మృతదేహంతో బైక్ పైనే 90కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. అన్నమయ్య జిల్లా చిట్వేల్ గ్రామానికి చెంది బాలుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి రుయాలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అయితే  కొడుకు మృతదేహాన్ని తరలించడానికి హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్లను అతడి తండ్రి సంప్రదించగా రూ.20వేలు డిమాండ్ చేసారు. అన్ని డబ్బులు ఇచ్చుకోలేని అతడు బయట తక్కువకు ఓ అంబులెన్స్ ను మాట్లాడుకున్నాడు. అయితే బయటి అంబులెన్స్ ను హాస్పిటల్ లోపలికి రానివ్వకపోకుండా సిబ్బంది అడ్డుకున్నారు. 

ఇలా ఓవైపు కొడుకు మృతిచెందడంతో పుట్టెడు దు:ఖంలో వున్న ఆ తండ్రికి హాస్పిటల్ సిబ్బంది మరింత వేధించారు. హాస్పిటల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్ల నిర్వాకంతో దిక్కుతోచని పరిస్థితితో కుమారుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తీసుకెళ్లాడు.