గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్... ఇంట్లోనే దేవినేని ఉమ దీక్ష

అమరావతి:  కృష్ణా జిల్లా గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

First Published Jan 20, 2021, 2:28 PM IST | Last Updated Jan 21, 2021, 8:26 AM IST

అమరావతి:  కృష్ణా జిల్లా గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి ఉద్యమం 400  రోజుల పూర్తి అయిన నేపథ్యంలో టీడీపీ దీక్షకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో గొల్లపూడి సెంటర్ పోలీసుల వలయంలో ఉంది. దీంతో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసం సమీపంలోని నివాసాలు ఉండే వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గొల్లపూడి ప్రాంతం మొత్తం కర్ఫ్యూ  వాతావరణాన్ని తలపిస్తోంది. పోలీస్ ఆంక్షలతో దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు టీడీపీ నాయకులు దూలిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు.