దెందులూరులో ఉద్రిక్తత... పోలీసులకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని మాస్ వార్నింగ్
ఏలూరు: ప్రశాంతంగా వుండే దెందులూరులో కావాలనే వైసీపీ హింసను ప్రేరేపిస్తోందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. దిశ డీఎస్పీ దగ్గరుండి మరి టీడీపీవాళ్లను కొట్టించారని అన్నారు.
ఏలూరు: ప్రశాంతంగా వుండే దెందులూరులో కావాలనే వైసీపీ హింసను ప్రేరేపిస్తోందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. దిశ డీఎస్పీ దగ్గరుండి మరి టీడీపీవాళ్లను కొట్టించారని అన్నారు. తనకు ప్రాణహాని వుందని కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు కేసు ఫైల్ చేయలేదు కానీ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారని టిడిపి కార్యకర్తను అరెస్ట్ చేసి పోలీసులే దగ్గరుండి మరీ కొట్టించారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం... పోలీసులపైన కూడా ప్రైవేట్ కేసులు పెడతాం అని చింతమనేని హెచ్చరించారు. ఇక తనపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపైనా చింతమనేని విరుచుకుపడ్డారు. విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు పెట్టిన ఎస్సైకి చింతమనేని వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టిన నిన్ను ఎవరూ కాపాడలేరని... నీ భార్యాబిడ్డలు బాధపడాల్సి వుంటుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరించారు.