హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ ప్రమాదం.. 11 మంది మృతి..

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి పదిమంది వరకు కార్మికులు చిక్కుకుపోయారు

First Published Aug 1, 2020, 4:11 PM IST | Last Updated Aug 1, 2020, 5:46 PM IST

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి పదిమంది వరకు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో ఏడుగురిని వెలికి తీశారు. అయితే ప్రమాద వివరాలు చెప్పడానికి యాజమాన్యం నిరాకరిస్తోంది. జనసేన కార్యకర్తలు కార్మికులకు తమ మద్దతు తెలిపారు. అంతేకాదు సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్లే క్రేన్ ప్రమాదం జరిగిందని జనసేన నాయకులు అంటున్నారు. సేఫ్టీ మెజర్స్ లేని కంపెనీలన్నీ మూసేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.